![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -78 లో..... గౌతమిని తీసుకొని జాను వాళ్ళు ఇంటికి వస్తారు. అమ్మ గౌతమిని లోపలికి తీసుకొని వెళ్ళు అని జానూ చెప్తుంది. చాలా థాంక్స్ సూర్య అని జాను చెప్తుంది. తను వెళ్ళిపోతాడు. అక్కడున్న ఇంటిపక్కన వాళ్ళు .. ఏంటి గౌతమికి ఏమైంది ఎవరితోనో లేచిపోతుంటే కొట్టి తీసుకొని వచ్చారా అంటూ మాట్లాడుతుంటే వాళ్ళపై జాను కోప్పడుతుంది.
ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాక అసలు ఏమైందో గౌతమిని కూర్చొపెట్టి అడుగుతారు. తోట పేపర్స్ ఇస్తానంటే వెళ్ళాను కానీ ఇలా చేస్తాడనుకోలేదని గౌతమి అంటుంది మన కుటుంబం మీద పగతో నా పరువు తియ్యాలనుకున్నాడట కళ్యాణ్ చెప్పాడని గౌతమి చెప్తుంది. ఇప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని జాను అనగానే వద్దని శారద చెప్తుంది. మరొకవైపు సింహాద్రి వాళ్ళు కళ్యాణ్ గురించి టెన్షన్ పడుతుంటే.. అప్పుడే కళ్యాణ్ ని తన ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు. అక్కడే భువన కూడా ఉంటుంది. ఏంటి ఈ దెబ్బలు అని అడుగుతారు. ఆ గౌతమి పార్టీ ఇవ్వమని వెంటపడితే పార్టీ ఇచ్చాను.. వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి నా చెల్లిని కిడ్నాప్ చేసావని కొట్టారు.. వాళ్ళతో సూర్య బావ కూడా ఉన్నాడని కళ్యాణ్ చెప్పగానే సింహాద్రికి కోపం వస్తుంది. వాళ్ళని అసలు వదిలి పెట్టొద్దు అన్నయ్య అని భువన చెప్తుంది.
మరొకవైపు గౌతమి బాధపడుతుంటే తనని నవ్వించడానికి అందరు ట్రై చేస్తారు. ఆ తర్వాత ఈ రోజు వంట నేను చేస్తానని మురళి అంటాడు. అందరి ముందు బిల్డప్ ఇచ్చాను కానీ నాకు వంట రాదే అని బాబిన్ కి ఫోన్ చేసి బయట నుంచి తెప్పిస్తాడు. ఆ తర్వాత మురళి కి హెల్ప్ చెయ్యమని పెద్దావిడ నందుని కిచెన్ లోకి పంపిస్తుంది. నందు వెళ్తుంటే జారీ పడిపోబోతుంటే మురళి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |